Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో కొండెక్కిన కోడి ధర

Chicken rate in hyderabad touched sky
Advertisement
  • గత వారం కిలో చికెన్ ధర రూ. 250 - 280
  • ఇప్పుడు రూ. 300కు చేరుకున్న వైనం
  • పెరిగిన ధరలతో భారీగా పడిపోయిన అమ్మకాలు
Advertisement
హైదరాబాద్ లో భారీగా పెరిగిన చికెన్ ధర మాంసాహార ప్రియులకు షాక్ ఇస్తోంది. కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న ధర చికెన్ ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. గత వారం కిలో స్కిన్ లెస్ చికెన్ రేట్ 250 నుంచి 280 మధ్యలో ఉంది. ఇప్పుడు అది ఏకంగా రూ. 300కు చేరుకుంది. మరో 15 రోజులపాటు చికెన్ ధర ఇలాగే ఉంటుందని వ్యాపారులు చెపుతున్నారు. ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిందని... కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని తెలిపారు. జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. 

పెరిగిన చికెన్ ధరలతో రీటైల్ చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. వినియోగదారులు చికెన్ షాపులకు వెళ్లడాన్ని తగ్గించేశారు. బిజినెస్ తగ్గడంతో చికెన్ రీటైల్ వ్యాపారులు కూడా డీలా పడిపోతున్నారు. మొన్నటి వరకు రోజుకు 20 కిలోల చికెన్ అమ్మేవాడినని... ఇప్పుడు 10 కిలోలు మాత్రమే సేల్ అవుతోందని ఒక వ్యాపారి వాపోయాడు.

Advertisement
Advertisement
Chicken
Hyderabad
Rate

More Telugu News